తెలంగాణ

ఇసుకపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని పరిశ్రమలు, మైనింగ్ శాఖా మంత్రి కె తారక రామారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా అంతర్ జిల్లాలకు రవాణా చేసే లారీల విషయంలో కఠినంగా ఉండాలని, క్రిమినల్ కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. మైనింగ్ శాఖపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేలా మైనింగ్ విధానం ఉండాలన్నారు. స్థానిక అవసరాల కోసం దగ్గరలోని రీచ్‌ల నుంచే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవడానికి వీలుగా పూర్తి అధికారాలను కలెక్టర్లకే ఇవ్వనున్నట్టు చెప్పారు. స్థానికంగా ఇసుక సరఫరా చేసే ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు మన లక్ష్యం కావొద్దని, కానీ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. స్థానికంగా ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకు అవసరమయ్యే ఇసుక సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని కెటిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. దీనికోసం జిల్లాలో ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు. మైనింగ్ అక్రమాలు, మాఫియా ఆగడాలను పూర్తిగా అరికడతామన్నారు. గనుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇప్పటికే మైనింగ్ ఆదాయంలో 41శాతం వృద్ధితో దక్షిణ భారత దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నామని చెప్పారు. గత ఏడాది ఇసుక ఆదాయం అనేక రెట్లు పెరిగిందని, ఈసారి మరింతగా పెరుగుతుందని చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజి జిల్లాలో మొబైల్ స్వ్కాడ్‌లను ఏర్పాటు చేస్తారు. అక్రమంగా రవాణా చేసి స్థానికంగా ఇసుక డంప్‌లను ఏర్పాటు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఓవర్ లోడింగ్ సమస్యను అరికట్టేలా నూతనంగా పదుల సంఖ్యలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ఎక్కడెక్కడ వే బ్రిడ్జిలు అవసరమో వెంటనే మైనింగ్ శాఖ అధికారులకు తెలపాలని కలెక్టర్లను కెటిఆర్ ఆదేశించారు. ప్రతి మైనింగ్ ఆస్తిని జియో ట్యాగ్, జియో ఫెన్సింగ్ ఏర్పాటు ద్వారా పరిరక్షించాలన్నారు. ఇసుకుకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుకను ఉపయోగించేలా ప్రోత్సహించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను పెంచాలని నిర్ణయించారు. సమావేశంలో గనుల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, టియస్ యండిసి యండి ఇలంబర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.