తెలంగాణ

ఎందుకిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అంచనాలు తారుమారు కావడాన్ని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్రంగా పరిగణించారు. ఏడు పార్లమెంట్ స్థానాల్లో ఓటమికిగల కారణాలపై ప్రగతిభవన్‌లో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఓడిపోయిన అభ్యర్థులతో కేసీఆర్ ఆరా తీశారు. శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు తగ్గడానికిగల కారణం ఏమిటీ? ఎమ్మెల్యేలు ఎంత మేరకు సహకరించారు? మరెదైనా కారణం ఉందా? అనే కోణంలో కేసీఆర్ ఆరా తీశారు. నిజామాబాద్‌లో పరాజయం పాలైన కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేకంగా కేసీఆర్‌తో సమావేశమై కొన్ని స్థానాల్లో పార్టీ ఓటమికిగల కారణాలను వివరించారు. అంతకుముందు కవిత, కరీంనగర్‌లో ఓడిపోయిన వినోద్‌కుమార్, భువనగిరిలో ఓడిపోయిన బూర నర్సయ్యగౌడ్‌ను విడివిడిగా కలిసి వారి ఓటమికిగల కారణాలపై సేకరించిన సమాచారాన్ని హరీశ్‌రావు పార్టీ అధినేతకు నివేదించారు. టీఆర్‌ఎస్‌కు గుండెకాయ లాంటి ఉత్తరతెలంగాణలో పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం ఏమిటీ? పైగా అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి కాకుండా ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎలా మారింది? ఈ ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య ముందుగానే ఏదేనా అవగాహన కుదిరిందా? అనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి తన ప్రచారాన్ని వదిలేసి పూర్తిగా బీజేపీ అభ్యర్థి విజయానికి బహాటంగానే పని చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో కూడా అలానే జరిగిందా? అని పార్టీ నేతలను కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 46.9 శాతం ఓట్లు సాధించగా, పార్లమెంట్ ఎన్నికల్లో అది 41.3 శాతానికి పడిపోవడానికి గల కారణంపై తాజాగా సర్వే నిర్వహించి తెలుసుకోవాలని కొందరు నేతలు సూచించినట్టు తెలిసింది. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కేవలం
7.1 శాతం ఓట్లు సాధించగా అది పార్లమెంట్ ఎన్నికల్లో 19.9 శాతానికి, అలాగే కాంగ్రెస్ ఓటింగ్ శాతం 28.4 నుంచి 29.5 శాతానికి పెరగడానికిగల కారణాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇలా ఉండగా పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన పసునూరి దయాకర్, నేతగాని వెంకటేశ్, రంజిత్‌రెడ్డి, మనె్న శ్రీనివాస్‌రెడ్డి, మాలోతు కవిత, పి రాములు, నామా నాగేశ్వర్‌రావు, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలియజేయగా వారికి కేసీఆర్ అభినందనలు తెలిపారు.