తెలంగాణ

చైన్ బ్యాచ్ దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసి రాజధానిలో పట్టపగలు గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఘరానా నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో దాదాపు 80 గొలుసు, నగల దొంగతనాలకు పాల్పడిన మీర్ ముస్త్ఫా అలీ, షేక్ ఖయూమ్ ఎల్‌బినగర్ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం జహనుమాకు చెందిన మీర్ ముస్త్ఫా, యుపి రాష్ట్రం మీరట్‌కు చెందిన షేక్ ఖయూమ్ ఈ దొంగతనాలు చేశారు. 2014 నుంచి వీరు దొంగతనాలు చేస్తున్నారు. ముస్త్ఫా అలీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. 2014లో మార్కెట్ పడిపోవడంతో ఆర్ధిక ఇబ్బందులకు గురై యుపికి చెందిన షేక్ ఖయ్యూమ్‌తో కలిసి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఎక్కడో ఒకచోట గొలుసు దొంగతనం చేయడం, నగలషాపులో విక్రయించి విలాసవంతమైన జీవితం గడిపేవారని పోలీసులు తెలిపారు. వీరు 2014లో బజాజ్ పల్సర్‌ను హిమాయత్‌నగర్‌లో దొంగతనం చేసి దానిపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే మహిళల మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యేవారు. పల్సర్ బండిపై తిరుగుతూ రోజుకో గొలుసు దొంగతనం చేసేవారని ఎల్‌బి నగర్ జోన్ డిసిపి ఇక్బాల్ చెప్పారు. వీరు ఇంతవరకు 1.5 కేజీల బంగారం వరకు ఆభరణాలను, రెండు నల్ల రంగు బజాజ్ పల్సర్‌లను, ఒక హీరో మెస్ట్రోబైక్, కత్తులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఇద్దరు నిందితులు బైక్‌పై తిరుగుతుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 23వ తేదీన బైరామల్‌గూడ వద్ద వీరిని అరెస్టు చేశామని డిసిపి చెప్పారు. వీరు సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో 71 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9 కేసులు ఉన్నాయి. ఎల్‌బినగర్ ఏసిపి వేణుగోపాల్‌రావుకేసుదర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం...
నేరగాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టిన సైబరాబాద్ పోలీసులు