తెలంగాణ

జూపార్కుల్లో నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలోని 11 జూపార్క్‌లలో సందర్శకులతో పాటు జంతువులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యాటక మంత్రి జోగు రామన్న ఆదేశించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రి అధ్యక్షతన జరిగిన జూ పార్కుల అథారిటీ పాలకవర్గ సమావేశంలో 2016-17 వార్షిక ప్రణాళికను ఆమోదించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించాలని మంత్రి ఆదేశించారు. ఈ పార్క్‌లో భారీ సైజులో పక్షుల ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఈ పార్క్‌లో హై సెక్యూరిటీ కంచెలను ఏర్పాటు చేయాలని, సిసి టీవిలతో నిరంతరం నిఘాపెట్టాలని సూచించారు. నెహ్రూ జూపార్క్‌లో కొత్తగా బ్యాటరీ రైలును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని జూపార్క్‌లను ఆధునీకరించాలని, ఇందుకోసం ప్రణాళికలను రూపొందించి తనకు పంపిస్తే పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి బిఆర్ మీన, పీసిసిఎఫ్ పరేశ్‌కుమార్ శర్మ, వైల్డ్‌లైఫ్ చీఫ్‌వార్డెన్ ఎకె శ్రీవాత్సవ, జూపార్క్‌ల అథారిటీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, క్యూరేటర్ శివాన్ దోంగ్రే తదితరులు పాల్గొన్నారు.