తెలంగాణ

హీరో వరుణ్ తేజకు తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జూన్ 12: హైద్రాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్తున్న హీరో, మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ప్రయాణిస్తున్న కారు బుధవారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాణిపేట స్టేజి వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఏపీ 13ఎం 1960 అనే నెంబరుగల ఇండికా కారు పెబ్బేరు నుంచి రాణిపేటకు మలుపు తిరుగుతుండగా వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న టీఎస్ 06 జిసి 2799 అనే నెంబరుగల బెంజ్‌కారు హైద్రాబాద్ నుంచి వస్తూ రాణిపేట స్టేజి వద్ద పరస్పరం ఢీకొన్నాయ. ఇండికా కారులో ప్రయాణిస్తున్న రాజుతో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సినీ హీరో వరుణ్‌తేజ తృటిలో ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు కాకుండానే బయట పడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. వరుణ్ తేజతో పాటు మరో మూడు వాహనాల్లో స్నేహితులు వెంట ఉండటంతో ఆ వాహనాల్లో వరుణ్‌తేజ వెళ్లి పోయాడు.

చిత్రాలు.. ప్రమాదానికి గురైన సినీహీరో వరుణ్‌తేజ బెంజి కారు,* ఆ కారును ఢీకొట్టిన ఇండికా కారు