తెలంగాణ

చెత్తకుప్పలో.. టెన్త్ జవాబు పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, జూన్ 12: కలకలం సృష్టించిన పదవ తరగతి జవాబు పత్రాల గల్లంతు వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆసీఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని రైల్వేస్టేషన్‌లో చెత్తకుప్పల్లో కన్పించడంతో ఒక్కసారిగా ఇంటర్‌మీడియట్ అధికారులు అప్రమత్తమయ్యారు. పోస్టల్ అధికారుల నిర్లక్యం కారణంగా ప్రశ్నాపత్రాలు ఇలా చెత్తకుప్పల్లోకి పోయాయన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయ. పట్టణంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పదవ తరగతి జవాబుపత్రాల గల్లంతు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇందుకు పోస్టల్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా కన్పిస్తోంది. ఈ విషయమై కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభమైన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను అదే రోజు సాయంత్రం పోస్టల్ అధికారులు 13 బ్యాగుల్లో పోస్ట్ ఆఫీస్ నుండి రైల్వే స్టేషన్‌కు ఆటోలో తరలిస్తుండగా అదే సమయంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో ఒక బ్యాగు కిందపడిపోయంది. ఈ విషయాన్ని పోస్టల్ సిబ్బంది గమనించలేదు. గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ బ్యాగులను మంచిర్యాలకు తరలించేందుకు రైల్వే మెయిల్ సర్వీస్ బోగీలో బ్యాగులను లోడ్ చేస్తుండగా ఒక బ్యాగు గల్లంతు అయినట్టు సిబ్బంది గమనించి తమ అధికారులకు తెలియజేశారు. అధికారులు గాలింపు చేపట్టినప్పటికీ సమాచారం లభించకపోవడంతో మంగళవారం ఉదయం కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో పట్టణ సీఐ కిరణ్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టగా గల్లంతయిన ప్రశ్నాపత్రాల సంచి ఆచూకీ లబించింది. సంచి గల్లంతయిన అనంతరం రైల్వేస్టేషన్ సమీపంలో అటుగా వెళ్తున్న మహిళ చెత్తకుప్పలో పడి ఉన్న భ్యాగును తీసుకుని సమీపంలోనే ఉన్న రైల్వే ఉద్యోగి క్వార్టర్‌లో దాచి ఉంచింది. ఆ ఉద్యోగి డ్యూటీకి వెళ్ళి బుధవారం ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో బ్యాగును గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు జిల్లా విద్యాధికారి భిక్షపతి సమక్షంలో పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ శంకరయ్య, హన్మంతు, వరలక్ష్మి పరిశీలించారు. తాము వేసిన సీల్‌లలో ఏమీ తేడాలేదని వారు నిర్దారించడంతో ఆ బ్యాగును జిల్లా విద్యాధికారికి అందించారు. ఈ బ్యాగులో పట్టణానికి చెందిన 65మంది విద్యార్థులు రాసిన తెలుగు, హిందీ, ఉర్దూ జవాబు పత్రాలు ఉన్నాయి.

చిత్రం...చెత్తకుప్పలో లభించిన జవాబు పత్రాల సంచి