రాష్ట్రీయం

తెలంగాణలో ప్రతి జిల్లాలో అంబేద్కర్ భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: ఏపీలో ఎస్సీ వర్గాలకు అందుబాటులో ఉన్న అంబేద్కర్ భవనాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇటువంటి భవనాలను ఏర్పాటు చేస్తామని టీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన స్థానికంగా ఉన్న అంబేద్కర్ భవన్‌ను సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు.
విశాఖ నగరానికి నడిబొడ్డున సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన అంబేద్కర్ భవన్ ద్వారా అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఎస్సీ విద్యార్థులు గ్రూప్ వన్, తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్ నిర్వహణ, గ్రంథాలయం వంటి సదుపాయాలు భేష్‌గా ఉన్నాయని ప్రశంసించారు. పెద్ద విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఏసీ హాల్‌లో ఫంక్షన్‌ల నిర్వహణకు వీలుగా ఉందని, జీవీఎంసీ పరిధిలో ఉన్న ఇటువంటి ప్రజాప్రయోజన భవనాలకు స్థానిక సంస్థలు పన్ను రాయితీ ఇస్తే మరింత మెరుగైన సేవలందించేందుకు అస్కారం ఉంటుందన్నారు. అనంతరం ప్రాంగణంలోనే ఉన్న అంబేద్కర్ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించారు. మాజీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సింహాద్రి సారధ్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. విశాఖలో అంబేద్కర్ భవన్ మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు తన వంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో నిర్వహణకు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ అధ్యక్షుడు బొడ్డు కల్యాణ రావు, ఉపాధ్యక్షుడు గార సూర్యారావు, ఈసీ మెంబర్లు అలమండ ప్రసాద్, సీవీఆర్ మోహనరావు పాల్గొన్నారు.

చిత్రం... విశాఖలోని అంబేద్కర్ భవన్‌లో బుద్ధ విగ్రహం వద్ద తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్