తెలంగాణ

లిక్కర్ ఇండియాలో వివాదం పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: లిక్కర్ ఇండియాలో వివాదానికి తెరపడ్డది. గత ఆరు నెలల నుండి ఈ కంపెనీలో నెలకొన్న ఉద్రిక్తత తగ్గింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో సచివాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో లిక్కర్ ఇండియా వివాదంపై చర్చలు జరిగాయి. లిక్కర్ ఇండియా యాజమాన్యం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్, జనరల్ మేనేజర్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. కార్మికుల సంఘం తరఫున గౌరవ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రతినిధులు ఆదిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. వేతన ఒప్పందం అమలు చేయడం, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, తదితర అంశాలపై అంగీకారం కుదిరింది. దాంతో లిక్కర్ ఇండియాలో కొనసాగుతున్న వివాదం సమసిపోయిందని అధికార వర్గాలు వెల్లడించాయి.