రాష్ట్రీయం

ఎన్నికల శిక్షణకు డుమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: జిహెచ్‌ఎంసి ఎన్నికల విధుల నిమిత్తం నియమితులై, శిక్షణ కార్యక్రమానికి తరుచూ గైర్హాజరవుతున్న 6511 మంది సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28,29, 30 తేదీల్లో మొత్తం 20వేల 836 మంది ఉద్యోగులకు ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమాలకు హజరుకావల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో 14వేల 325 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హజరయ్యారని అధికారులు తెలిపారు. గైర్హాజరైన 6511 మందిపై జిహెచ్‌ఎంసి చట్టంలోని సెక్షన్ 6(1)2ను అనుసరించి క్రిమినల్ చర్యలు చేపట్టడానికి పోలీసు శాఖకు లేఖలు రాయాలని జిహెచ్‌ఎంసి ఎన్నికల అథారిటీ, కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి ఎన్నికల విభాగం అధికారును ఆదేశించారు. దీంతో పాటు సంబంధిత ఉద్యోగుల విభాగాధిపతులకు కూడా లేఖలు రాయాలని సూచించారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణకు దాదాపు 60వేల పై చిలుకు సిబ్బంది అవసరం కాగా, నగరంలో ఉద్యగుల కొరత ఉండటం వల్ల పొరుగు జిల్లాలైన మహబూబ్‌నగర్, మెదక్, నల్గోండ జిల్లాల అధికారులు, సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు హజరుకావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిందని తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడత శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, గైర్హాజరైన 6511 మంది సిబ్బంది తిరిగి జనవర్ 4, 5 తేదీలో నిర్వహించే శిక్షణకు హజరయ్యే మరో అవకాశం కల్పించినట్లు, హజరుకాని పక్షంలో క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల వ్యయం రూ. 5లక్షలకు పెంపు
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని రూ. రెండు లక్షల నంచి రూ. 5లక్షలకు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణపై రెండురోజుల క్రితం నాగిరెడ్డి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే! ఇందులో పలు పార్టీలకు చెందిన నేతలు అభ్యర్థి ఎన్నికల వ్యయం పెంచాలని వినతులు సమర్పించటంతో పరిమితిని రెండు నుంచి 5లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. వారి వినతులపై అధ్యయనం చేసినానంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇతర కార్పొరేషన్లలో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని లక్షన్నర రూపాయలకు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో లక్ష రూపాయలు పెంచుతూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.