తెలంగాణ

జిల్లా జడ్జిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 28: తెలంగాణ న్యాయమూర్తులపై హైకోర్టు విధించిన సస్పెన్షన్ వ్యవహారం వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. హైకోర్టు విభజన విషయంలో న్యాయం చేయాలంటూ 20 రోజులుగా ఆందోళనలు చేపట్టిన సమయంలో హైకోర్టు సస్పెన్షన్ నిర్ణయం మరింత వివాదానికి దారితీసింది. మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి కోర్టు హాలు, బయట ఆందోళనలు చేపట్టారు. న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కోర్టు హాలులో ఫస్ట్ అడిషినల్ జిల్లా జడ్జి నర్సింహులుపై దాడి జరిగింది. తనపై 8మంది న్యాయవాదులు దాడి చేశారంటూ జిల్లా జడ్జి నర్సింహులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లా జడ్జి నర్సింహులుపై దాడికి పాల్పడిన న్యాయవాదులు మొలుగూరి రంజిత్, ఓడెపల్లి శ్యాంకిషన్, శిల్ల రాజేంద్రప్రసాద్, అంబటి శ్రీను, అల్లం నాగరాజు, పివి రమణ, తీగల జీవన్‌గౌడ్, అకింపాషలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హన్మకొండ ఏసిపి శోభన్‌కుమార్ ఆధ్వర్యంలో సుబేదారి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ వాసాల జడ్జిపై దాడికి పాల్పడిన న్యాయవాదులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ అడిషినల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ అనిత ఎదుట హాజరుపర్చగా, 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో న్యాయవాదులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.