తెలంగాణ

ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూన్ 28: ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నిర్ధారణకు తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి) హైదరాబాద్‌లో డిఇఓ కార్యాలయాలను ముట్టడించింది. డిఇఒ కార్యాలయాల ఎదుట ఎబివిపి కార్యకర్తలు వందలాది మంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 150 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు దీనావస్థలో ఉంటే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు జిల్లాల వారీ ప్రైవేటు విద్యను నియంత్రిస్తూనే కార్పొరేట్ విద్యను నిషేధించి జిల్లాల వారీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఫీజుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులను, 430 ఎంఇఓ పోస్టులను, 38 డిప్యూటీ డిఇఓ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఆసిఫాబాద్ కోర్టుకు కోబాడ్ గాంధీ

ఆసిఫాబాద్, జూన్ 28: మావోయిస్టు అగ్రనేత కోబాడ్ గాంధీని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసు ఎస్కార్ట్ వాహనంలో భారీ బందోబస్తు మధ్య మధ్యాహ్నం 3 గంటలకు గాంధీని కోర్టుకు తరలించి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 1998లో బెల్లంపల్లి రైల్వే పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, తుపాకులు అపహరించుకెళ్లిన వారిలో కోబాడ్‌గాంధీ నిందితుడుగా ఉన్నాడు. ఈ ఘటనలో పలు కేసులను ఎదుర్కొంటున్న అతనిని హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుండి బెల్లంపల్లి కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా, అక్కడి మున్సిఫ్ మెజిస్ట్రేట్ సెలవుపై వెళ్లడంతో ఆసిఫాబాద్ కోర్టుకు తరలించారు.