తెలంగాణ

తడిసి ముద్దయన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయ. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఖరీఫ్ రైతాంగానికి ఊపిరి పోశాయి. సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా నిన్నటి వరకు ఏడారిని తలపించిన చెరువులు, రిజర్వాయర్లలోకి వరదనీరు చేరడంతో ఖరీఫ్ పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
నల్లగొండ
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం 20 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జంటనగరాల్లో కురిసిన వర్షాలు, వరదలతో మూసీ నది జిల్లా పరిధిలో కాజ్‌వేల, బ్రిడ్జీల మీదుగా పొంగి ప్రవహిస్తోంది. బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, వలిగొండ మండలాల మీదుగా మూసీ పొంగి ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి-పోచంపల్లి, బట్టుగూడెం-పెద్దరావులపల్లి, మక్తానంతారం-పిల్లాయిపల్లి, పోచంపల్లి-పెద్దరావులపల్లి మధ్య రోడ్ కాజ్‌వేల మీదుగా మూసీ వరద సాగుతుండడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం నెలకొంది. మిషన్ కాకతీయ పనులకు ఆటంకం ఏర్పడింది. రైతులు ఖరీఫ్ పంటల సాగు పనుల్లో భాగంగా విత్తనాలు వేసే పనులను ముమ్మురం చేశారు.
నిజామాబాద్
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సగటున 15.1మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల్లో ఇంకా వరద జలాలు వచ్చి చేరనప్పటికీ, రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నట్టు ఏకధాటిగా వానలు కురిస్తే జిల్లాలో బోసిపోయి ఉన్న జలాశయాలు జలకళను సంతరించుకోనున్నాయి.
కరీంనగర్
జిల్లాలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. తూర్పు ప్రాంతమైన మంథని, మహదేవ్‌పూర్ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగడంతో మహదేవపూర్ మండలంలోని పంకెన, పలిమెల, పెద్దంపేట, లెంకలగడ్డ, సర్వాయిపేట, దమ్మూరు, నీలంపల్లి, బూరుగుగూడెం, ముకునూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కమాన్‌పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ నిండిపోయి జలసిరిని సంతరించుకుంది. జిల్లాలోని ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 51 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
మెదక్
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా జిల్లాలో చెదురుమదురు వర్షాలతోనే రైతులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలకు జీవం పోస్తున్నాయని జిల్లాలోని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లలో అంతంత మాత్రంగానే వర్షపాతం నమోదైంది.ఆశించిన వర్షాలు కురియకపోవడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద జిల్లాలో అడపాదడపాగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ ఆరుతడి పంటలను బతికిస్తున్నాయ.
వరంగల్
జిల్లాలో సోమవారం రాత్రి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కొలనులుగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరుకుంది. అత్యధికంగా హన్మకొండలో 72.2 వర్షపాతం నమోదు కాగా వరంగల్‌లో 58 శాతం వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జిల్లాలోని ధర్మసాగర్, నర్సంపేట, నల్లబెల్లి, సంగెం, మహబూబాబాద్, కేసముద్రం తదితర మండల కేంద్రాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షాలతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. విత్తనాలు జోరుగా వేస్తున్నారు. ఇప్పటికే వేసిన విత్తనాలు సైతం ఈ చిరుజల్లులకు మొలకెత్తుతాయనే ఆశతో రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
ఖమ్మం
జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు అలుగులు పడగా, ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన వర్షాలు పడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24గంటల్లో అత్యధికంగా బూర్గంపాడు మండలంలో 72.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లలో ఒకటైన పెద్దవాగు ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్ళను వదులుతున్నారు. అలాగే పాలేరు, కినె్నరసాని, వైరా రిజర్వాయర్లలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. అలాగే మసివాగు, బుగ్గవాగు, రాళ్ళవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కెటిపిఎస్ 7వ దశ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఉపరితల గనుల్లోకి నీరు రావటంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలిగింది.