తెలంగాణ

రుణమాఫీ చేసేది ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా రుణమాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రుణమాఫీ ఎప్పుడు చెల్లిస్తారన్న దానిపై స్పష్టత లేదన్నారు. రైతులకు రుణమాఫీని విడతల వారీగా చేస్తారా? ఒకేసారి చెల్లిస్తారా? ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బ్యాంకులు కూడా రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదన్నారు. పెట్టుబడి సాయం కోసం రైతుబంధు చెల్లించినట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది కానీ సగం మంది రైతులకు ఇంతవరకు చెల్లించలేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఇచ్చిన రుణాన్ని చెల్లిస్తేనే తిరిగి రుణాలు ఇవ్వగలమని బ్యాంకర్లు అంటున్నారని వివరించారు. రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఖరీఫ్ పంట రుణ ప్రణాళికలో (2019-20) ఏ జిల్లాలోనూ 10 శాతం కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వెంటనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలపై నాబార్డు 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చెల్లించే విధంగా బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. పాత బకాయిలను వడ్డీతో సహ చెల్లిస్తేనే ఖరీఫ్‌కు రుణాలు ఇహ్తామని సహకార బ్యాంకులు రైతులుకు నోటీసులు జారీ చేశాయని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.