తెలంగాణ

ఇంటర్ అడ్వాన్స్‌డ్ తర్వాత మరో మారు డిగ్రీ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాల అనంతరం మరోసారి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు చేపడతామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సీట్లు పొందిన వారిలో 1,19,109 మంది కాలేజీల్లో రిపోర్టు చేశారని చెప్పారు. 2947 మంది కాలేజీలు మారారని, మరో 2344 మంది కాలేజీల్లోనే బ్రాంచిలు మారారని, 603 మంది దరఖాస్తు చేసుకున్నా వారికి ఎలాంటి మార్పు సంభవించలేదని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో 21,253 మంది, ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 8440 మంది, యూనివర్శిటీ అటానమస్ కాలేజీల్లో 2080 మంది, యూనివర్శిటీ కాలేజీల్లో 469 మంది, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో 5870, ప్రైవేటు ఎయిడెడ్ అటానమస్‌లో 538 మంది, ప్రైవేటు అన్ ఎయిడెడ్‌లో 79,562 మంది, ప్రైవేటు అన్ ఎయిడెడ్ అటానమస్‌లో 790 మంది, రైల్వే కాలేజీల్లో 96 మంది చేరారని చెప్పారు. వర్శిటీల వారీ చూస్తే కాకతీయ యూనివర్శిటీ పరిధిలో 32,198 మంది, మహాత్మాగాంధీ వర్శిటీ పరిధిలో 6321 మంది, ఉస్మానియా పరిధిలో 47,487 మంది, పాలమూరులో 9011 మంది, శాతవాహనలో 14392 మంది, తెలంగాణ వర్శిటీలో 9683 మంది చేరారు. డిగ్రీ సీట్లు పొందిన వారు ఇంజనీరింగ్‌లో చేరడం లేదని, ఇంజనీరింగ్‌లో చేరే వారు డిగ్రీలో చేరడం లేదని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.