తెలంగాణ

హై సెక్యూరిటీ జోన్‌గా బీఆర్‌కే భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: కొత్త సచివాలయ నిర్మాణం కోసం తాత్కాలిక సచివాలయంగా ఎంపిక చేసిన బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను సాధారణ పరిపాలనశాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే కార్యాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ వంటి ముఖ్యమైన కార్యాలయాలు ఏర్పాటు కానుండటంతో బీఆర్‌కే భవన్‌ను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించింది. దీంతో బీఆర్‌కే భవన్ చుట్టూరా భద్రతావలయాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్‌కే భవన్ భద్రతా ఏర్పాట్లపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. బీఆర్‌కే భవన్‌ను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించడంతో ఈ భవనానికి ముందున్న మూడు రోడ్లను మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లీంచనున్నారు. అలాగే, జీహెచ్‌ఎంసీ, రిడ్జ్ హోటల్, కళాంజలి, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద బారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఈ భవనానికి పక్కననే ఆదర్శనగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీవీఐపీల రక్షణ, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీస్‌శాఖను ప్రభుత్వం కోరింది. ప్రస్తుత సచివాలయంలో ఉన్న పోస్ట్ ఆఫీస్, రెండు బ్యాంకులను కూడా బీఆర్‌కే భవన్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయంలో ఉన్న హాస్పిటల్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న హెల్త్ సెంటర్‌కు తరలించాలని నిర్ణయించారు. బీఆర్‌కే భవన్‌కు తరలించే కార్యాలయాలు కాకుండా ఇతర కార్యాలయాలను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసిన 25 భవనాలలోకి మార్చాలని నిర్ణయించారు. బీఆర్‌కే భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్ పరిసరాలు హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి రానుండటంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే రహదారులను మూసివేసి, ఇతర వాహనాలను అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాల్సిందిగా పోలీస్‌శాఖను ప్రభుత్వ ఆదేశించింది. సచివాలయం నుంచి ముఖ్యమైన శాఖలు బీఆర్‌కే భవన్‌కు తరలిస్తుండటంతో ఇక్కడ ఇప్పటివరకు ఉన్న కార్యాలయాలను ఇతర కార్యాలయాల్లోకి తరలించే కార్యక్రమం దాదాపు పూర్తి అయింది. ఈ భవనంలో ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్ ఒక్కటే యథాతథంగా ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. సచివాలయంలోని ముఖ్యమైన ఫైళ్ల భద్రత కోసం బీఆర్‌కే భవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.