తెలంగాణ

చార్మినార్ నుంచి మహబూబ్‌నగర్ వరకు బైక్ రైడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ నుండి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి ఎకోపార్క్ సందర్శనకు బైక్‌రైడ్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 300 బైక్‌లపై యువకులు మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చేరుకున్న తర్వాత మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారితో కలిసి బైక్‌రైడ్‌లో పాల్గొన్నారు. ఆయన కూడా బైక్‌ను నడుపుకుంటూ మయూరి పార్క్‌పై విసృత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మయూరి పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలకు తగిన ప్రచారం లేదని అందుకే రాష్ట్ర పర్యాటక శాఖ తరపున వివిధ పర్యాటక ప్రాంతాలపై ప్రచారం నిర్వహించడానికి ఇలాంటి బైక్‌రైడ్ కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. చార్మినార్ నుండి మహబూబ్‌నగర్ మయూరి పార్క్ వరకు 300 బైక్‌లతో ర్యాలీ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వాటికి తగినంతా ప్రచారం నిర్వహించి రాష్ట్రాన్ని పర్యాటకులు ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చారిత్రక వారసత్వ సౌందర్యాలకు తెలంగాణలో కొదవలేదని కానీ వాటిని మరింత అభివృద్ది చేయడంలో గత పాలకులు విస్మరించారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని మయూరి ఎకోపార్క్ సహజసిద్ధమైన కొండల మధ్య ఉందని అటవీ అందాలు చూడముచ్చటగా ఉంటాయని తెలిపారు. తెలంగాణలోని ప్రజలంతా ఈ పార్క్‌ను చూడేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పాలమూరు పర్యాటక కేంద్రానికి నిలయమనే విధంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బైక్‌రైడ్ అసోషియేషన్ ప్రతినిధులు జయభారతి, శాంతి, సందీప్, కలీం తదితరులు పాల్గొన్నారు.