తెలంగాణ

16న మున్సిపల్ ఓటర్ల జాబితా వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పోరేషన్లలో ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలను ఈ నెల 16 న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాస్తవంగా ఈ జాబితా ఈరోజే ప్రకటించాల్సి ఉంది. ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి సాంకేతికపరమైన అంశాలు అడ్డుగా ఉన్నాయని, అందువల్ల ఈ జాబితాల ప్రకటనకు రెండురోజుల సమయం కావాలని జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు కోరారని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. చట్టప్రకారం తమకు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని ఈ నెల ఆరున జారీ చేసిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తూ, ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రకటించేందుకు రెండురోజుల గడవు పెంచామన్నారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 16 న ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించారు.