తెలంగాణ

మహిళలు ఆర్థికంగా ఎదగాలి: రాజేశంగౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: మహిళలు ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జీ. రాజేశంగౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ స్ర్తిశక్తి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పూర్తిగా చేయూత ఇస్తోందని, వివిధ రూపాల్లో సబ్సిడీలు ఇస్తోందన్నారు. స్వయం సహాయక కార్యక్రమాల్లో భాగంగా సొంతంగా ఉపాధి పథకాలు, కార్యక్రమాలు, యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్న మహిళలకు చేయూత ఇస్తున్నట్టు తెలిపారు. రుణాలు ఇచ్చే విషయంలో స్ర్తిశక్తి ప్రతినిధులతో పాటు బ్యాంకర్లను కూడా సమావేశపరుస్తానని, బ్యాంకర్లు ఉదారంగా రుణాలు ఇచ్చేందుకు సహకరిస్తానని రాజేశంగౌడ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా ఉన్నతస్థానానికి రావాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, తెలంగాణ బ్రాహ్మణ స్ర్తిశక్తి ప్రతినిధులు, నాయకులు టి. అనూరాధ, గీత, యమున పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న రాజేశంగౌడ్