తెలంగాణ

నిజాం సుగర్స్ లిక్విడేషన్ ఉత్తర్వులతో కార్మికుల్లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూలై 14: నిజాంసుగర్స్ కార్మికులలో పెండింగ్ వేతనాల ఆందోళన నెలకొంది. లిక్విడేషన్ ఉత్తర్వులతో తమ వేతనాలు ఎవరిస్తారని కార్మికులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం కార్మికులు తమ వేతనాల వివరాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమిత లిక్విడేటర్ గోపాలక్రిష్ణ గుప్తాకు అందించారు. ఈ కర్మాగారాలను విక్రయించినట్టయితే తమ వేతనాల సమస్య గాలికొదిలేసే ప్రమాదం ఉందని ఇక్కడి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. బోధన్, మెట్‌పల్లి, మెదక్ యూనిట్లలలో మొత్తం 165 మంది కార్మికులు పనిచేశారు. కర్మాగారాలలో లే ఆఫ్ ప్రకటించే సమయంలో ఈ కార్మికులంతా కర్మాగారంలో విధుల్లో ఉన్నారు.
అయితే గత మూడేళ్ల నుండి వీరు తమకు రావాల్సిన బకాయిల కోసం చేయని ఉద్యమం అంటూ లేదు. కలిసిన వారికల్లా తమ గోడును వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కర్మాగారం ఆస్తులను వేలం వేస్తారన్న ప్రచారం జరుగుతుండంతో కార్మికులలో ఆందోళన మరింత రెట్టింపయ్యింది. ఫ్యాక్టరీల సంగతెలా ఉన్నప్పటికీ యాజమాన్యం నుండి తమకు రావాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాయి. సంవత్సరాల తరబడి వేతనాలు అందకపోవడంతో అనేకమంది ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం లిక్విడేషన్ ఉత్తర్వులతో వారి పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. పెండింగ్‌లో ఉన్నటువంటి వేతనాలు రాకపోయినట్లయితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు చేస్తామని చెబుతున్న నాయకులు కనీసం తమకు వేతనాలు వచ్చేలా కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు. బోధన్‌లో కొందరు యువకులు పార్టీల కతీతంగా ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తామంటూ సమాయత్తమవుతున్నారు. ఈ ఉద్యమకారులు ముందు తమ వేతనాలు ఇప్పించేందుకు చొరవ చూపాలని, ప్రభుత్వంపై తమ కోసం ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతున్నారు. కార్మికులకు సంవత్సరాల తరబడి వేతనాలు రావాల్సి ఉన్నాయని, వారి కుటుంబాల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నా ఆయా పార్టీల నాయకులు వారి వేతనాల గురించి సర్కారుపై ఒత్తిళ్లు తీసుకురాలేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది.
కార్మికుల గోడు ఎవ్వరికీ పట్టదా వారి వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి తమ పెండింగ్ వేతనాలు తమకు వచ్చేలా తమ వంతు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.