తెలంగాణ

యాదాద్రి సహా పలు ఆలయాల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, బాసర, జూలై 16: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను మంగళవారం మూసివేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయం, ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యుల బృందం చంద్రగ్రహణం నేపధ్యంలో స్వామివారి నిత్య ఆర్జిత సేవల్లో భాగంగా రాత్రి నిర్వహించే ఆరాధన, ఆరగింపు, పవళింపు కార్యక్రమాలను ముందుగానే నిర్వహించేసి ఆలయ ద్వార బంధనం చేశారు. బుధవారం తెల్లవారుజామున 5:30కు ఆలయ సంప్రోక్షణ జరిపి, నిత్య ఆర్జిత సేవలు నిలిపివేసి ఉదయం 9గంటల నుండి భక్తులకు దర్శనాలు పునరుద్ధరించనున్నారు. అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి గర్భాలయ ద్వారాలను ఆలయ అర్చకులు సాయంత్రం నాలుగు గంటలకు మూసివేశారు. ఉప ఆలయాలు అయిన మహాకాళి అమ్మవారి ఆలయం, గోదావరి నదీతీరాన గల సూర్యేశ్వరాలయం, వ్యాస ఆలయ ద్వారాలను సైతం మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గంగాజలాలతో సంప్రోక్షణ నిర్వహించి ఆలయంలోని అమ్మవార్లకు, ఇతర ఆలయాలలో అభిషేక అర్చన, హారతి పూజలు నిర్వహించి ఉదయం 8 గంటల నుండి పూజలను కొనసాగిస్తారు.
చిత్రాలు.. బాసర, యాదాద్రి ఆలయాల ద్వారాలను మూసివేస్తున్న సిబ్బంది