తెలంగాణ

టీచర్ల బదిలీల షెడ్యూలు ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: అంతర్‌జిల్లా బదిలీల షెడ్యూలును వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) గురువారం నాడు డిమాండ్ చేసింది. జాక్టో నేతలు సదానంద్‌గౌడ్ (ఎస్టీయు), ఇ రఘునందన్, కే రమణ (టీటీఎఫ్), జీ సోమయ్య (టియుటీఎఫ్), కే కృష్ణుడు (బీసీటీఏ), కే లక్ష్మణ్ నాయక్ (టీఎస్‌టీటీఎఫ్), జీ రాములు (టీఎస్‌టీయుటీయు, కే మల్లీశ్వరి (టీడబ్ల్యుటీఎఫ్) తదితరులు పాత్రికేయులతోమాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో అంతర్‌జిల్లా బదిలీలు జరగడం లేదని, ఒకే కుటుంబంలో భార్యాభర్తలు టీచర్లుగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారని, వారెంతోకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది మే 16న ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి నిర్వహించిన భేటీలో భార్యాభర్తలను సమీప ప్రాంతాలకు పంపిస్తామని, వీలైతే ఒకే పాఠశాలకు పంపుతామని చెప్పారని అంతర్‌జిల్లా బదిలీలు చేయకపోగా, ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సులతో పలుకుబడి బదిలీలు చేపట్టారని ఇది అన్యాయమని పేర్కొన్నారు. ఇంకా 400 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం అందిందని, అక్రమ బదిలీలను ఇప్పటికైనా నిలిపివేయాలని అన్నారు. టీచర్ల పీఆర్‌సీ, ఐఆర్ ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీఆర్టీ నియామకాల్లో రోస్టర్ ఉల్లంఘన జరిగిందని ఎస్‌సీఎస్టీయూఎస్ తెలంగాణ సంఘం అధ్యయుడు కొంగల వెంకటి, ప్రధానకార్యదర్ళి లింగాల శంకర్ పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఎక్కడా రోస్టర్ పాటించలేదని వారు ఆరోపించారు. విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా రోస్టర్ పాటించాలని పేర్కొన్నా, ఇష్టానుసారం పోస్టులను భర్తీచేశారని అన్నారు. మరీ ముఖ్యంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో ఏ అభ్యర్థి ఏ కేటగిరి నుండి ఎంపిక అయ్యారో కూడా పేర్కొనలేదని, దీనివల్ల ఏ కేటగిరి నుండి ఎంత మంది ఎంపికయ్యారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. భర్తీ చేసే ముందు గత ఏడాది రోస్టర్‌లో ఏ పాయింట్ వద్ద ముగిసిందో, ఏ పాయింట్ నుండి రోస్టర్ ఈ ఏడాది అమలు చేస్తున్నారో కూడా చెప్పాల్సి ఉందని అన్నారు. ఈ లోపాలు అన్నింటినీ నివారించి తక్షణం రీ కౌనె్సలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌లకు ఫిర్యాదు చేసి, న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.