తెలంగాణ

చిరుమర్తిని తప్పుపట్టి మీరెట్లా బీజేపీకి పోతారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మధ్య శుక్రవారం ఆసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. కోమటిరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తోండగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరితే తప్పుపట్టి మీరెట్లా బీజేపీకి పోతారు’ అని ప్రశ్నించారు. ‘బీజేపీలోకి వెళితే మీ గొంతు మీరే కోసుకున్నట్టే’ నని సోలిపేట అన్నారు. ‘మీ పార్టీ ఇప్పటికే ఓవర్ లోడ్. మాలాంటి ఓవర్ వెయిట్స్ వస్తే మునుగుతారన్న’ అని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. ‘చిరుమర్తి మోసగాడు. నెలకు యాబై వేల జీతం ఇంతకాలం బతికించింది నేనే, అతన్ని మ్మెల్యే చేసేందే నేనే’ అని కోమటిరెడ్డి అన్నారు.