రాష్ట్రీయం

బొగ్గు ఉత్పత్తికి వరుణుని దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 30: సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తిని గత నాలుగు రోజులుగా వర్షం దెబ్బ తీస్తోంది. సింగరేణి పరిధిలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తే కీలకం. వేసవికాలంలో ఎండల తీవ్రతకు బొగ్గు ఉత్పత్తి మందగించగా వర్షాకాలంలో వరుణుడి ప్రభావం కూడా బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ఉంది. సింగరేణిలో ఒక కొత్తగూడెం ఏరియాలోని జెవిఆర్ ఓపెన్ కాస్టుగని, గౌతంఖని ఓపెన్‌కాస్టు కలిపి రోజుకు 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాయి. అయితే గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తి జరగడంలేదు. ఈ పరిస్థితుల్లో కొత్తగూడెం ఏరియాలోనే గడచిన నాలుగురోజుల్లో 78వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో 14 ఓపెన్‌కాస్టు గనులు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియాలోనే ఈ మేరకు నష్టం వుంటే సింగరేణి వ్యాప్తంగా దీనికి రెండింతలు ఉండొచ్చని అంచనా.

చిత్రం..ఓపెన్‌కాస్టు గనిలో నిలిచిన వర్షం నీరు