తెలంగాణ

ఆటోను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూన్ 30: ఆటోను వెనుక నుండి లారీ ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం పాల య్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో బుధవారం రాత్రి పదకొండు గంటలు దాటిన తరువాత జరిగింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవరుతో సహా ముగ్గురు మృతి చెందగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు కార్మికులు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణానికి చెందిన బత్తుల రామ్మోహన్ (47) ఆటో డ్రైవరు. బుధవారం రాత్రి పటన్‌చెరు మండలం ఇస్నాపూర్ కూడలిలో ఆరు మంది ప్రయాణికులను తన ఆటో నంబరు ఎపి 23 వై 9702లో ఎక్కించుకుని సంగారెడ్డి వైపు బయలుదేరాడు. దౌలాపురం బాల్‌రాజ్ (32), ఎండి రఫిక్ (44), తుల్జారామ్, నరేష్, విష్ణు, అంతనోళ్ల మహేందర్ తదితరులు ఇస్నాపూర్ చౌరస్తా వద్ద సంగారెడ్డి వైపు వెళ్లడానికి ఆటోలో ఎక్కారు. రుద్రారం దాటి గ్రామ శివారులలోకి రాగానే ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంక్ ఎదురుగా ముందు ఉన్న వాహనం అకస్మాత్తుగా నిలిచిపోవడంతో డ్రైవరు బత్తుల రామ్మోహన్ ఆటోకు సడన్ బ్రేక్ వేసాడు. దీనితో దాని వెను ఉన్న లారీ ఎపి 29టిఏ 5678 ఆటోను అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరు రామ్మోహన్, దౌలాపురం బాల్‌రాజ్, ఎండి రఫిక్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మిగిలిన నలుగురు తుల్జారామ్, నరేష్, విష్ణు, మహేందర్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. మరణించిన రామ్మోహన్ సంగారెడ్డికి చెందిన ఆటో డ్రైవరు కాగా అదే ప్రాంతానికి చెందిన రఫిక్ పాశమైలారం పారిశ్రామికవాడలోని కిర్భీ బిల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో కార్మికుడు. దౌలాపురం బాల్‌రాజ్ కవలంపేట గ్రామస్థుడైన ఇతరు పాశమైలారంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో చిరు ఉద్యోగి. మిగిలిన నలుగురు వివిధ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులు.
యువకుడిని బలిగొన్న మరో లారీ
సదాశివపేట మండలం నందికంది గ్రామానికి చెందిన బైండ్ల ప్రభాకర్ (36) పటన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఏరైన్ లైఫ్ సైనె్సస్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో ఉద్యోగి. ఇదిలా ఉండగా బుధవారం సెకండ్ షిప్టు డ్యూటీ పూర్తి చేసుకుని పాశమైలారం నుండి నందికందిలోని తన ఇంటికి ఎపి 23ఎం 2316 నంబరు గల బైక్‌పై వెళ్తుండగా రుద్రారం గ్రామ శివారులలో గల తోషిబా పరిశ్రమ కూడలిలో ప్రమాదం జరిగింది. వెనుక నుండి వస్తున్న లారీ టిఎన్ 05 బిసి 5401 వేగంగా బైక్‌ను ఢీకొట్టింది. దీనితో సదరు బైక్ ప్రయాణిస్తున్న ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు బైండ్ల సంజీవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్ శ్రీనివాస్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.