తెలంగాణ

వ్యక్తిగత ప్రయోజనాలకు సర్కారీ నిధులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత ఊరు పర్యటన, సత్కారాలు, సన్మానాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా, అక్కడ ప్రతిగడపకూ 10 లక్షల రూపాయిల లబ్దిచేకూరే విధంగా ఆస్తులను సమకూరుస్తానని చెప్పడం చూస్తుంటే వ్యక్తిగత ప్రయోజనాలకు సర్కారీ నిధులు వెచ్చించడం ఆయన అహంభావానికి ప్రతీక అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన సొంత ఊరు చింతమడక వెళ్లడం, ఆ వూరు వాస్తుకు అనుకూలంగా ఉండటంపైనా గ్రామాభివృద్ధిపై ఆయన మాటలపైనా ఎవరికీ అభ్యంతరం లేదని అక్కడ ఆత్మీయ, అనురాగ సమ్మేళనాలపై కూడా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయిల లబ్ది చేకూర్చేలా 200 కోట్ల రూపాయిలు కేటాయిస్తానని చెప్పడంపై మాత్రం తమకు అభ్యంతరం ఉందని అన్నారు. చేతిలో అధికారలం ఉందని తన ఇష్టం వచ్చిన రీతిలో నచ్చిన వాళ్లకు మెడలో వేసుకుంటాను అనే పద్ధతిలో సీఎం మాట్లాడటం దారుణమని అన్నారు. సీఎం మాటలు రాచరిక వ్యవస్థను తలపిస్తున్నాయని, రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయిస్తే ఇలా నేరుగా సీఎం వచ్చి వరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని, రాగద్వేషాలకు అతీతంగా నిష్పాక్షపాతంగా పరిపాలన కొనసాగిస్తానని పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సీఎం ఇలా సొంత వారికి వరాలు ప్రకటించడం దారుణమని అన్నారు. అదే తీరున మిగిలిన అన్ని గ్రామాలనూ ఎందుకు పరిగణించడం లేదని నిలదీశారు.
కార్మికుల వేతనం పెంచాలని ప్రగతి భవన్ ముట్టడి
పంచాయతీ కార్మికులకు వేతనం పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు సంబంధించిన జీవో జారీ చేలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం నాడు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి జీతాల పెంపుదలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, అధ్యక్షుడు పీ గణపతిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ శ్రీపతిరావులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు 2018 జూలైలో చేపట్టిన 33 రోజుల సమ్మె సందర్భంగా సీఎం కార్మికుల వేతనాలు 8500 రూపాయిలకు తగ్గకుండా చెల్లిస్తామని ప్రకటించారని వారు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి తక్షణమే జీవో జారీకి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
చిత్రం...ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేస్తున్న సీఐటీయూ నేతలు