తెలంగాణ

ప్రజోద్యమంగా హరిత హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: హరితహారం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజోద్యమంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో విద్యార్థి నుంచి సిఎం వరకు అందరూ పాల్గొనాలన్నారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో హరితహారంపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈనెల 8నుంచి రెండు వారాల పాటు రాష్టవ్య్రాప్తంగా హరిత హారాన్ని ప్రజోద్యమంగా విస్తృతంగా నిర్వహించాలని సిఎం సూచించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని, ఇందుకోసం 46 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచామని, ఒకే ఏడాదిలో 46 కోట్ల మొక్కలు నాటిన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ చరిత్ర సృష్టించాలన్నారు. ప్రభుత్వశాఖలన్నీ ఎవరికి వారుగా ప్రత్యేక ప్రణాళిక, కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు అన్ని చోట్ల ఆయా శాఖలు మొక్కలునాటే కార్యక్రమంపై రెండు, మూడు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈనెల 4న సిఎస్ రాజీవ్ శర్మతో సమావేశమై శాఖలవారీ చేపట్టనున్న కార్యక్రమానికి తుదిరూపు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అన్నిచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాలన్నారు. నాటే వాటిలో పండ్లు, పూలు, ఔషధ, నీడ మొక్కలు ఉండాలని, నాటడంతో సరిపెట్టకుండా నాటిన వాటిని సంరక్షించుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, మార్కెట్ యార్డులు, ఆర్టీసి బస్టాండ్లు, సింగరేణి ప్రాంగణాలు, పోలీసు స్టేషన్లు, చెరువులు, రిజర్వాయర్లు, వాగులు, వొర్రెలు, గట్లను మొక్కలు నాటే ప్రాంతాలుగా ఎంచుకోవాలని సూచించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లవెంట కూపా మొక్కలు నాటాలన్నారు. గ్రామ సర్పంచులు, కార్యదర్శులు చొరవ తీసుకుని ప్రతి ఇంటిలో మొక్కలు నాటేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. నాటిని చెట్లకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లు, మంత్రులు తమ వద్ద నిధులను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అడవులను 33శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రచార, ప్రసారా సాధనాలు, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా చెట్లు పెంపకం అవశ్యకను వివరించాలని ఆదేశించారు. కవి సమ్మేళనాలు, ఉర్దూ మషాయిరాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు.
చిత్రం... తెలంగాణలో నిర్వహించనున్న హరితహారంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్