తెలంగాణ

ఉగ్రవాద మూలాలకు మజ్లిసే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 2: రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరా బాద్‌లో ఉగ్రవాదులు తిష్ట వేయడానికి మజ్లిస్ పార్టీయే కారణమని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ విమర్శించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతున్న మజ్లిస్ పార్టీ అధినేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, దీంతో మజ్లిస్ అసలు స్వరూపం ఏమిటో బయటపడిందని నిరంజన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసి హైదరాబాద్‌ను కాపాడిన ఎన్‌ఐఎను అసద్ అభినందించకుండా, ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని చెప్పడం, పైగా వారు నిర్ధోషులని తేలితే సదరు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించడం దుర్మార్గమని నిరంజన్ నిప్పులు చెరిగారు. వారు ఉగ్రవాదులేనని తేలితే అసద్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, మజ్లిస్ పార్టీని రద్దు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తీవ్రవాదుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని ఆయన కోరారు.