తెలంగాణ

చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు దశలవారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమక్షంలో శనివారం ప్రైవేటు ఆసుపత్రుల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం గత ఎనిమిది నెలల నుంచి తమకు రూ.300 కోట్ల బకాయలు చెల్లించాల్సి ఉందని, వీటిని చెల్లించేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం విదితమే. దీంతో గురువారం నుండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అయతే మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజుల నుండి పర్యటనల్లో ఉండటంతో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. లక్ష్మారెడ్డి శనివారం హైదరాబాద్‌కు చేరుకోగానే ప్రైవేటు ఆసుపత్రుల సంఘంతో చర్చలు జరిగాయి. ఈ చర్చల వివరాలను శనివారం రాత్రి అధికారికంగా విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రతినెలా రూ.40 కోట్ల చొప్పున ఆరోగ్యశ్రీ బకాయలు విడుదల చేస్తామని, ఇందుకోసం ఈ నెల అదనంగా రూ.100 కోట్లు విడుదల చేశామని, ఈ డబ్బు రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు. గత మూడు రోజుల నుండి నిలిపివేసిన ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరించేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అంగీకరించాయని వైద్య మంత్రి కార్యాలయం ప్రకటించింది.