తెలంగాణ

చెరువులో శ్రీరాముని విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, జూలై 2: కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు కట్ట నిర్మాణం పనుల్లో శనివారం చెరువు కట్ట కింద జరుగుతున్న తవ్వకాల్లో శ్రీరాముని విగ్రహం బయల్పడింది. దేవుడి విగ్రహం బయట పడడంతో చెరువు తవ్వకం చేపట్టిన నిర్వాహకులు వెంటనే పనులను నిలిపివేసారు. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో ప్రజలు తండోప తండాలు తరలి వచ్చి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసారు. అర్చకుడు పాలెపు రామకృష్ణశర్మ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేయించి భక్తులతో పాలభిషేకం చేయించారు. చెరువు కట్టకు శ్రీరాముని సేతు అని నామకరణం చేసి రామమందిరం నిర్మించాలని డిమాండ్ చేసారు. గతంలో ఇదే స్థలంలో గణపతి విగ్రహం లభ్యంకాగా, పక్కనే ఉన్న నాగులమ్మ దేవాలయంలో తరలించి పూజలు నిర్వహించారని తెలిపారు. పూర్వం ఇక్కడ రామాలయం ఉండేదని, తవ్వకాల్లో మరిన్ని విగ్రహాలు బయటపడే అవకాశం ఉందని భక్తులు అన్నారు.
కాగా, కోరుట్ల సిఐ రాజశేఖర్‌రాజు, తహశీల్దార్ మధు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్‌ను ఈవిషయంపై వివరణ కోరగా కట్ట ప్రాంతం ప్రభుత్వ స్థలం అని, గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని తెచ్చిపెట్టారని, విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సిఐ రాజశేఖర్‌రాజు విగ్రహాన్ని సమీప దేవాలయానికి తరలించి పూజలు నిర్వహించుకోవాలని సూచించగా, స్థానికులు మాత్రం విగ్రహం ఇక్కడ బయటపడినందున ఆలయం నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లోకిని రంజిత్, గంగాధర్, రమేష్, అర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, బిజెవైఎం నేతలు పాల్గొన్నారు.

చిత్రం.. రాముడి విగ్రహానికి పూజలు చేస్తున్న అర్చకులు