తెలంగాణ

మజ్లిస్ పార్టీని నిషేధించాలి, అసద్‌ను అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 2: మజ్లిస్ పార్టీని నిషేధించి, ఆ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్.ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదులకు న్యాయ సహా యం అందిస్తామని అసదుద్దీన్ ప్రకటించడం విచారకరమని ప్రభాకర్ శనివారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం, తెరాస ఏవిధంగా సమర్థిస్తాయని ఆయన ప్రశ్నిం చారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు అసద్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మజ్లిస్ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కీలుబొమ్మగా మారింది కాబట్టే ఆ పార్టీ పట్ల కఠినంగా వ్యవహారిం చలేకపోతోందన్నారు. జాతీయ నిఘా విభాగం (ఎన్‌ఐఎ) రంగంలోకి దిగి తీవ్రవాదులను అరెస్టు చేసేంత వరకూ ఆ విషయం రాష్ట్ర నిఘా విభాగానికి తెలియలేదని ప్రభాకర్ విమర్శించారు. నిఘా విభాగానికి స్వేచ్ఛ ఇచ్చి దానిని పటిష్టవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్.ప్రభాకర్