తెలంగాణ

నాగంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 2: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తెరాస కార్యకర్తలు ఆయనపై దాడికి యత్నించారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవినీతిపై మాత్రమే కోర్టుకు వెళ్లానని, ఈ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్న తెరాస నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా గెస్ట్‌హౌస్‌పై దాడికి దిగి, తలుపులను ధ్వంసం చేశారు. ప్రెస్‌మీట్ జరుగుతున్న మీటింగ్ హాల్‌లోకి చొచ్చుకొచ్చి కుర్చీలను బిజెపి నాయకులపైకి విసిరేశారు. అంతేకాకుండా నాగంపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. దీంతో అక్కడున్న బిజెపి కార్యకర్తలు తెరాస నాయకులపై తిరగబడటంతో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. తెరాస నాయకులు మళ్లీ నాగంపైకి రావడంతో అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు. దాదాపు అరగంట సేపు గెస్ట్‌హౌస్‌లో వీరంగం సృష్టించిన తెరాస కార్యకర్తలను పోలీ సులు బయటికి లాక్కొచ్చారు. అనం తరం తెరాస నాయకులు అతిథిగృహం ముందు బైఠాయించి ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. నాగం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే తెరాస నాయకులు ప్రెస్‌మీట్‌లోకి వచ్చి దాడికి యత్నించడాన్ని నిరసిస్తూ బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఈ దాడికి పాల్పడిన వారిపై బిజెపి నాయకులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చిత్రం.. మహబూబ్‌నగర్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన
సమావేశంలో ఆందోళన చేస్తున్న తెరాస కార్యకర్తలు
చిత్రం.. కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గెస్ట్‌హౌస్ తలుపులు