తెలంగాణ

ప్రత్యేక జిల్లా కోసం పోరు ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూలై 2: జనగామను జిల్లాగా మార్చాలని డి మాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాలు స్తోంది. కొన్ని మాసాల నుంచి శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం మ రింత ఉద్ధృతమై హింసాత్మక సంఘటనలకు దారితీస్తోంది. ఉద్యమకారులపై లాఠీచార్జికి నిరసనగా శనివారం జిల్లా సాధన ఐకాస నిర్వహించిన బంద్ నిరసనలు, ఆందోళనలు, అరెస్టులతో ముగిసింది. శుక్రవారం బంద్ సందర్భంగా నిర్వహించిన ఆందోళనలో గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడంతో పాటు పోలీసు వాహనం సహా మరో పది వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీ సులు శుక్రవారం రాత్రి నుంచే జనగామలో 144 సెక్షన్ విధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మా రడంతో స్థానిక పోలీసులతో పాటు జిల్లా కేంద్రం రప్పించిన పోలీ సులను, పారా మిలటరీ బలగాలను చౌరస్తాలో మోహరించారు. అయనప్పటికీ ఉద్యమకారులు జట్లుగా ఏర్పడి చౌరస్తాలో ఆందోళన చేసేందుకు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. జనగామ జిల్లాను సాధిస్తాం’ అంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించడంతో పాటు భీష్మించి రోడ్డుపై పడుకున్నారు.
పోలీసు వ్యాన్‌లో తోపులాట
దీంతో వారిని పోలీసులు బల వతంగా వ్యాన్‌లోకి ఎక్కించగా, వ్యాన్‌లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి బిజెపి నాయకుడు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కెవిఎల్‌ఎన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు పోలీసులు రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో కెవిఎల్‌ఎన్‌రెడ్డి తలకు బలంగా దెబ్బ తగలి స్పృహ తప్పడంతో ఆయనను వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి, ఆ తర్వాత అక్కడి నుంచి ఎంజిఎంకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చౌరస్తాలో ప్రజలపై లాఠీలు ఝళిపించారు. ఇదిలా ఉండగా జెఎసి నాయకులు బక్క శ్రీను, బనుక శివరాజ్ యాదవ్ ఆకస్మాత్తుగా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు సుమారు 50 మంది ఉద్యమకారులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు ఆ తర్వాత వ్యక్తిగత పూచికత్తుపై వారిని విడుదల చేశారు. జనగామలో శాంతిభద్రతలను పరిశీలించేందుకు వచ్చిన అదనపు ఎస్పీ జాన్‌వెస్లీతో పాటు స్థానిక డిఎస్పీ పద్మనాభరెడ్డి చౌరస్తాలో పర్యటించి పరిస్థతిని పర్యవేక్షించారు. పోలీసులకు తగు సూచనలు చేసి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

చిత్రం.. రోడ్డుపై బైఠాయించిన ఉద్యమకారులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు
చౌరాస్తాలో నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు