తెలంగాణ

ఉస్మానియా లా కాలేజీకి జాతీయస్థాయి ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: ఔట్‌లుక్ మ్యాగజైన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒక సర్వేలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పిజి లా కాలేజీకి జాతీయ స్థాయిలో తొమ్మిదో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో గతంలో మూడు సార్లు 14 వ స్థానం పొందిన తమ కాలేజీ, 2015-16లో తొమ్మిదో స్థానం పొందిందని పిజి లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జాతీయ, కార్పోరేట్ లా కాలేజీలకు ధీటుగా ఓయూ పిజీ లా కాలేజీ పోటీపడి ఈ మేరకు ర్యాంకు సాధించిందన్నారు. యావత్ తెలంగాణకే ఇది గర్వకారణమన్నారు. కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా వర్క్‌షాపులు, సెమినార్‌లు నిర్వహిస్తున్నామని, కీలకోపన్యాసాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.