తెలంగాణ

రాజస్థాన్‌లో రైతుల ఖాతాల్లోకే సబ్సిడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: రాజస్థాన్‌లో ప్రభుత్వం రైతులకు విడుదల చేసే సబ్సిడీలు నేరుగా వారి అకౌంట్లకే చేరుతాయని ఆ రాష్ట్ర సామాజిక న్యాయం, ముద్రణ శాఖ మంత్రి అరుణ్ చతుర్వేది తెలిపారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అనుబంధ విభాగమైన కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న చతుర్వేది ప్రసంగిస్తూ రైతుల అకౌంట్లకే నేరుగా సబ్సిడీలు చేరవేస్తూ మధ్య దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. ఈ విధానంతో అవినీతికి తావు లేకుండా చేశామన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన చెప్పారు. ఫసల్ బీమా యోజనను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని, కేంద్ర మంత్రి వంటి ఉన్నత పదవుల వరకు ఎదిగే అవకాశం ఒక్క బిజెపిలోనే ఉందని ఆయన ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఉదహరించారు. మిగతా పార్టీల్లో వంశపారంపర్యం ఉంటుందని అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని విమర్శించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని ఎన్నికలకు ముందు గొప్పగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, ఈ రెండేళ్ళలో రెండు వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ఉద్యమించాలని, వారికి చేరువ కావాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కిసాన్ మోర్చా కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాజస్థాన్ మంత్రి అరుణ్ చతుర్వేది. చిత్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు