తెలంగాణ

సురవరానికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: అస్వస్థతకు గురై కోలుకుంటున్న సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సురవరం నివాసానికి వెళ్లారు. రాజాతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి యోగక్షేమాలను రాజా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ పర్యటన వివరాలను రాజా వివరించారు. ఇరువురూ తాజా రాజకీయలాపై గంటకు పైగా చర్చించుకున్నారు. అంతకుముందు మఖ్దూం భవన్‌లో డీ రాజా ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానకార్యదర్శి కాకి మాధవరావుతో భేటీ అయ్యారు.
సీపీఐ ప్రధానకార్యదరిశగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన డీ రాజాకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ఆదివారం ఉదయం విమానంలో వచ్చిన రాజాకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాషా, సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేశ్, పశ్యపద్మ తదితరులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో మహిళా సమాఖ్య కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. సీపీఐ కార్యకర్తలు విమాశ్రయంలోనే రెడ్ సెల్యూట్ కామ్రేడ్ రాజా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం భారీ కార్ ర్యాలీతో ఆయనను ఊరేగింపుగా మఖ్దూం భవన్‌కు తీసుకువచ్చారు.