తెలంగాణ

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: ఆర్డినెన్స్ ప్యాక్టరీలను ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దానిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్రప్రభుత్వ చర్యలపై ఆందోళనగా ఉన్నారని, సైన్యానికి సంబంధించిన అత్యంత ఆధునిక సాంకేతికతో కూడుకున్న ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్న 41 ఆయుధ కర్మాగారాలను కార్పొరేట్ సంస్థలుగా మార్చాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రభుత్వం లేఖ రాయాలని అన్నారు. అనేక యుద్ధాల్లో వినియోగించిన అత్యంత నాణ్యతతో కూడుకున్న యుద్ధపరికరాలను అందించడం ద్వారా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కృషి పట్ల దేశ ప్రజల్లో సమున్నత గౌరవం పెరిగిందని, అత్యంత కీలకమైన ఈ సంస్థలను కార్పొరేటీకరించడం అన్యాయమని తమ్మినేని పేర్కొన్నారు. 1987లో సంగారెడ్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రారంభమైందని, బీఎంపీ -2 యుద్ధ ట్యాంకులు, మైన్ ప్రూఫ్ వాహనాలను తయారుచేయడంలోనూ, సైన్యానికీ పారామిలటరీకి అవసరమైన యుద్ధ ట్యాంకులను, వాహనాలను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఉత్పత్తి చేయడంలోనూ ఈ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించిందని అన్నారు.