తెలంగాణ

భారత్‌లో మహిళా శక్తి గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూలై 5: భారత దేశంలో మహిళల శక్తి చాలా గొప్పదని, వారు ఏది సాధించాలని అనుకుంటే అది సాధించి తీరుతారని అంతర్జాతీయ యునిసెఫ్ చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ రూత్ లియానో, యునిసెఫ్ వాష్ స్పెషలిస్ట్ ఎస్.ఆర్.నల్లీ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరుకుళ్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసుకొని నిర్మల్ పురస్కార్‌కు ఎంపిక కావడంతో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో పర్యటించి మరుగుదొడ్లను పరిశీలించడంతో పాటు పూర్తి కావడానికి చేసిన కృషి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.నీరుకుళ్ల గ్రామం పూర్తి స్థాయిలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకొని ఆదర్శంగా నిలువడం అభినందనీయమన్నారు. హరితహారం పథకంలో భాగంగా మొక్కలను నాటారు. పూలతో పేర్చిన బతుకమ్మలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. గ్రామంలో ఉన్న మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని రాజమల్లయ్య, ఎంపిటిసి కొలిపాక అరుణజ్యోతితో పాటు ప్రజలను యూనిసెఫ్ బృందం అభినందించింది. ఈ కార్యక్రమంలో స్టేట్ యునిసెఫ్ ఇంచార్జి సుధాకర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ప్రకాష్, అధికారి మునీందర్, సానిటేషన్ అధికారి రాఘవులు, ఎంపిడిఓ వినోద్, జడ్పీటిసి ఊట్ల రమ, సర్పంచ్ బోయిని రాజమల్లు, ఆర్‌ఐ సురేందర్, కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న యునిసెఫ్ ప్రతినిధి రూత్ లియానో