తెలంగాణ

ఆర్టీసీ సమ్మెకు ‘జేఏసీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియకు ఎంప్లారుూస్ యూనియన్ పిలుపు ఇచ్చింది. కార్మిక సంఘాలు చేపట్టబోయే సమ్మెను మరింత ఉధృతం చేయడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జేఏసీ ఏర్పాటు చేయాల్సిందేనని ఎంప్లారుూస్ యూనియన్ పట్టుపడుతోంది. సమ్మె ప్రభావం ఏమిటో ప్రభుత్వానికి తెలియచెప్పడానికి జేఏసీ అవసరమని ఎంయూ గుర్తు చేస్తోంది. ఈ మేరకు ఎంప్లారుూస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజరెడ్డి శుక్రవారం టీఎంయుకు లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఐక్యంగా ఉద్యమించడానికి జేఏసీ ఏర్పాటు చేయడం ద్వారా సమ్మె బలోపేతం అవుతుందన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉన్నందున సమ్మెకు మరింత బలం చేకూరుతుందన్నారు. ప్రధానంగా మూడు అంశాలపై జేఏసీ ఏర్పాటుకు ఎంప్లారుూస్ యూనియన్ ఇతర కార్మిక సంఘాలకు పిలుపు ఇస్తోంది. డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 2017 నుంచి వేతన సవరణను అమలు చేయడం వంటి అంశాలను ఫోకస్ చేస్తోంది. కార్మికులకు దక్కాల్సిన కనీస అవసరాలను సైతం ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని అన్ని కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో పాటు ఎంప్లారుూస్ యూనియన్, జాతీయ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చాయి. ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందున, తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేయడానికి కార్మికులు ఐక్కంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఎంప్లారుూస్ యూనియన్ సూచిస్తోంది. జాతీయ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. సమస్యలతో నానాటికీ ఆర్టీసీ కార్మికులు అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆయన సీఎంను కోరారు. ఆర్టీసీని సమస్యల నుంచి గట్టెక్కించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగ భర్తీలు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పని భారం అధికమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన 41 రోజుల్లో ఎప్పుడైనా సమ్మెలోకి దిగుతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జాప్యం చేస్తూపోతే ఆర్టీసీ మరింత నష్టాల్లో చిక్కుకుంటుందని ఆయన గుర్తు చేశారు. ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం నిర్ణయం ఏమిటో చెప్పకతప్పదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.