తెలంగాణ

తన్నుకున్న తమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ పార్టీ ఉనికి రోజురోజుకు ప్రశ్నార్ధకమవుతున్నా తెలుగు తమ్ముళ్లలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదు. శుక్రవారం జిల్లా కేంద్రం నల్లగొండలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌ల పర్యవేక్షణలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి టీడీపీ సమావేశంలో హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. వేదికపై ఉన్న నాయకుల సమక్షంలోనే పరస్పరం ఘర్షణకు దిగడంతో వారిని ఇతర నాయకులు, కార్యకర్తలు నిలువరించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి చావ్లా కిరణ్మయి బీజేపీకి మద్దతుగా కార్యకలాపాలు సాగిస్తునే ఇప్పుడు పార్టీ సమావేశానికి ఎందుకు వచ్చారంటు వ్యతిరేక వర్గం నాయకులు మండవ నర్సయ్యగౌడ్ వర్గీయులు రచ్చకు దిగారు. కిరణ్మయి బయటకు టీడీపీ పార్టీలో కొనసాగుతునే అంతర్గతంగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తు పార్టీని బలహీనపరుస్తున్నారంటూ మండవ వర్గీయులు విమర్శలకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం విమర్శల పర్వం కాస్తా ఘర్షణకు దారితీసింది. తనపై వ్యతిరేక వర్గీయులు చేసిన విమర్శలను సమావేశంలోనే కిరణ్మయి తిప్పికొట్టారు. ఘర్షణ సద్దుమణిగాక తిరిగి సమావేశం కొనసాగించినా అప్పటికే వివిధ నియోజకవర్గాలకు చెందిన చాలామంది నాయకులు, కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాలు ఆ పార్టీ నాయకుల్లోని అంతర్గత కుమ్ములాటకు నిదర్శనంగా నిలిచాయి. నియోజకవర్గాల్గోని ఇన్‌చార్జిలు, కన్వీనర్లు, జిల్లా నాయకులంతా ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి వలసలు వెళ్లిపోవడంతో చెప్పుకోదగ్గ నాయకులు కరువైన జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.