తెలంగాణ

క్యాన్సర్ వ్యాధి తెలుసుకోవడానికి డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: క్యాన్స్‌ర్ (రాచపుండు) వ్యాధిని ముందస్తుగా తెలుసుకోవడానికి రాష్ట్రంలో డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అనేక వ్యాధులు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అయితే క్యాన్సర్ వ్యాధిని తెలుసుకోవడానికి టీకాలు లేవన్నారు. దీంతో క్యాన్సర్ వ్యాధి మహమ్మారిని నిరోధించడానికి రాష్ట్రంలో డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి సభకు తెలిపారు.
శనివారం శాసన మండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించలేక పోవడంతో వయస్సు మీదపడిన వ్యాధిగ్రస్తులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక మృతి చెందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధిని ముందుస్తుగా గుర్తిస్తే ప్రమాదాన్ని అంచనావేయవచ్చునని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. క్యాన్సర్‌ను తగ్గించే ఆసుపత్రులను పెంచాలని ఆయన మంత్రికి సూచించారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితే క్యాన్సర్ వ్యాధి కోసం 15- 20 లక్షలు వెచ్చించాల్సి వస్తోందన్నారు. సామాన్య వ్యక్తి క్యాన్సర్ బారినపడికతే కుటుంబం ఏమైతుందని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. అందకు మంత్రి సమాధానం ఇస్తూ త్వరలో రాష్ట్రంలో 400 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అరబిందో, అపోలో, బసవతారకం ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సకు మందులను తీసుకువస్తున్నాయని చెప్పారు. త్వరలో ఆదిలాబాద్, వరంగల్‌లో కాన్సర్ ఆసుపత్రులు పని చేస్తాయన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలను పట్టిపీడిస్తన్న క్యాన్సర్ వ్యాధికి గోళీలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావడం జరుగుతోందన్నారు.