తెలంగాణ

బడ్జెట్ నిరాశాజనకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, బడ్జెట్‌లో విద్య, వైధ్య రంగాలకు తగిన కేటాయింపులు లేవని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. శాసన మండలిలో మధ్యాహ్నం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతి నెల రూ.60,247 కోట్లు ఖర్చుపెట్టితే, అది పెద్ద మొత్తంలో తగ్గి రూ.11,503 కోట్లు ఖర్చుపెడుతునట్లు 2019-20 బడ్జెట్‌లో చూపించడం జరిగింది. అందులో కేవలం ఆరు వేల కోట్ల రూపాయాలు ప్రభుత్వం చెల్లించే వడ్డీలకు పోగా మిగత బడ్జెట్‌తో రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎలా ఖర్చుపెడుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకంతో పాటు ఆరోగ్యశ్రీ పథకంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి, అకుల లలిత, పూరణం సతీష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.