తెలంగాణ

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: దేశంలో ఆర్థి వ్యవస్థ దెబ్బతిందని, దీంతో ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై పడిందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎమెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాహన మండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, బడ్జెట్‌లో విద్య, వైధ్య రంగాలకు తగిన కేటాయింపులు లేవని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, వివిధ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 70వేలకు పైగా ఉపాద్యాయుల ఖాళీలున్నాయని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. జీఎస్‌టీ, నగదు బదిలీ కారణంగా దేశంలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వీద్య వాలంటీర్లకు జీతాలు సరిగ్గా రావడం లేదని ఈ విషయంలో ప్రభుత్వ తిగిన చర్యలు తీసుకుని తక్కువ జీతాలున్న వారికి వెంటనే చెల్లించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.