తెలంగాణ

కేంద్ర ట్రాఫిక్ రూల్స్‌ను అమలు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రాఫిక్ రూల్స్‌ను రాష్ట్రంలో అమలు చేయబోమని శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్టమ్రే కొత్త రూల్స్‌ను రూపొందించి అమలు చేస్తుందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ నిర్ణయాన్ని అమలు చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. శాసనసభలో ఆదివారం బడ్జెట్‌పై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ ఎంఐఎం సభ్యుడు మోజంఖాన్ ప్రస్తావించిన అంశాలపై స్పందించారు. ఉద్యోగుల పీఆర్‌సి, కొత్త పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ మంత్రిని ఆదేశిస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టుకు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తరలిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా హామీ ఇచ్చారు. అలాగే గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి సంగారెడ్డి వద్ద మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తామన్నారు.