తెలంగాణ

నిజాం తర్వాత తానే నవాబు అనుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సీపీఐ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన నారాయణ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి నిజాం తలొగ్గితే, సర్దార్ వల్లబాయ్ పటేల్ వల్లే విముక్తి కలిగిందని బీజేపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు. నిజాం నవాబు తర్వాత తానే నవాబును అని కేసీఆర్ అనుకుంటున్నారని రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆయన విమర్శించారు. ఎంఐఎంను చూసి పాలకులు భయపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఆయన తేల్చి చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మరో సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అజీజ్ పాషా, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కే కోదండరాం, చుక్కా రామయ్య, బూర్గుల నర్సింగరావు, కే ప్రతాప్‌రెడ్డి, విమలక్క, పల్లావెంకటరెడ్డి, కూనమనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట 72వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ భారీ ఏర్పాట్లతో ఈ సభను నిర్వహించింది. ఉత్సవాలు లోటస్ పాండ్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో గతవారం బూర్గుల నర్సింగరావు అధ్యక్షతన ప్రారంభం అయ్యాయి. వారోత్సవాల ప్రచార యాత్ర 11వ తేదీన మొదలై 17 వరకూ జరిగిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. అమరవీరుల ట్రస్టు కార్యాలయంలో ప్రారంభమై షాద్‌నగర్, నాగర్ కర్నూలు, దిండి, దేవరకొండ, నల్గొండ, హుజూర్‌నగర్, కోదాడ, నేలకొండపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, దేవురుప్పుల, హుస్నాబాద్ మీదుగా ఇందుర్తి చేరుకుందని అక్కడి నుండి కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల మీదుగా హైదరాబాద్ వచ్చిందని ఆయన వివరించారు.