తెలంగాణ

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు బీడీల తయారీపై ఆధారపడ్డారని వివరించారు. గోవాలో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన హరీశ్‌రావు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. తెలంగాణలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో వెయ్యి బీడీ తయారీ యూని ట్లు ఉన్నాయని, వీటిలో 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని వివరించారు. ఇందులో 90 శాతానికి పైగా పేద మహిళలే ఉన్నారన్నారు. బీడీలు చుట్టడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినప్పటికీ జీవనోపాధి కోసం చేయక తప్పడం లేదని పేర్కొన్నారు. బీడీ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్కొక్కరికీ నెలకు రూ. 2వేల చొప్పున ఆసరా పెన్షన్లు
అందిస్తుందన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ, బీడీల తయారీ, బీడీ ఆకుల వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి భారీగా పన్నులు విధించడం వల్ల, దీనిపై ఆధారపడి జీవనం కొనసాగించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుతం బీడీలపై 28 శాతం జీఎస్టీ, బీడీ ఆకులపై 18 శాతం జీఎస్టీని విధించడంతో ఈ పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక పరిస్థితులతో ముడిపడిన అంశం కావడంతో బీడీలపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు. బీడీ పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధికి ప్రత్యేక ఆర్థిక ప్రేరణ కార్యక్రమాలు తీసుకురావాలని సూచించారు. తాను పేర్కొన్న అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఇలావుంటే, బీడీ కార్మికులు, ముఖ్యంగా దీనిపై ఆధారపడిన మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో సమగ్రమైన ప్రతిపాదనలు అందజేయాలని హరీశ్‌రావును నిర్మలా సీతారామన్ కోరారు. బీడీ కార్మికుల పునరావాసం కోసం దేశమంతటికీ ఉపయోగపడే విధానం తీసుకరావడానికి ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రెవెన్యూ శాఖ కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నారు.