తెలంగాణ

హోటళ్ళకు ఊతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కొన్ని రకాల పానీయాలపై పన్ను రెండింతలు
* మొత్తం 20 వస్తువులు, సర్వీసలపై రేట్ల మార్పు
* జీఎస్‌టి మండలి తాజా నిర్ణయం

పనాజీ, సెప్టెంబర్ 20: ఆర్థిక మాంద్యానికి కళ్ళెం వేసేందుకు జీఎస్‌టీ మండలి శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 20 రకాల వస్తువులపైనే, 12 రకాల సర్వీసులపైనా జీఎస్‌టి రేట్లలో మార్పులు చేసింది. కొన్ని రకాల శీతల పానీయాలపై పన్నులను రెండింతలు చేసిన జీఎస్‌టీ కౌన్సిల్ హోటళ్ళపై విధించే సుంకాలు, కొన్ని రేట్లపై వస్తువులను తగ్గించింది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో కార్పోరేట్ పన్నులను భారీగా తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే జీఎస్‌టి మండలి కూడా రేట్లలో మార్పులు చేసింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆటోమొబైల్‌పై పన్నులు తగ్గించే విషయంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత కొంత కాలంగా డిమాండ్ తగ్గిన బిస్కెట్ల వంటి పదార్థాల విషయంలోనూ మండలి వౌనమే వహించింది. 27వ జీఎస్‌టి సమావేశానంతరం వివరాలను సీతారామన్ మీడియాకు వెల్లడించారు. కెఫెన్ కలిగిన పానీయాలపై 28 శాతం జీఎస్‌టితో పాటు 12 శాతం పరిహార సుంకాన్ని కూడా విధిస్తామన్నారు. ప్రస్తుతం ఈ పరిహార సుంకం 18 శాతం ఉంది. ఈ తాజా నిర్ణయం వల్ల ఏరేటడ్ పానీయాలపై విధించింది. పన్నుతో సమానం అవుతుంది. హోటళ్ళు, టూరిజాన్ని పెంపొందించే లక్ష్యంతో పలు ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు బస్సు ఛార్జీలు వసూలు చేసే హోటళ్ళపై ఎలాంటి పన్ను ఉండదు. అదే 1001 నుంచి 7,500 రూం ఛార్జీలు ఉన్న హోటళ్ళపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 18 శాతం ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించామన్నారు. అలాగే 7,500 రూపాయల రూం రెంట్ ఉన్న వాటిపై ఛార్జీలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామన్నారు. హోటళ్ళ వ్యాపారాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్ని రకాల వాహనాలకు కూడా పరిహార సుంకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 10 నుంచి 13 మంది ప్రయాణించే వాహనాలకు ఇది వర్తిస్తుందన్నారు.