తెలంగాణ

డీలర్ల కమిషన్ పెంపుపై హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో రేషన్ డీలర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించడంపట్ల తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోడి రాజు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్లు ప్రకటించారు. కోనే్నళ్ల నుంచి రేషన్ డీలర్లు ఎదర్కొంటున్న సమస్యలు దీంతో తీరుతాయని చెప్పారు. కొంతమంది కావాలని ఆనవసర ఆరోపణలు చేస్తున్నారని, అది పూర్తిగా అవాస్తవమనీ.. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలపై సీఎం అసెంబ్లీలో మాట్లాడం శుభపరిమణామం సీఎంతో పాటు మంత్రి గంగుల కమలాకర్, రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డికి సంఘం తరపున నాయికోటి రాజు కృతజ్ఞతలు తెలిపారు.