తెలంగాణ

ఇక తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లానీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 10: మిషన్ భగీరధ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లానీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వాటర్‌గ్రిడ్ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంజిల్లా కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 చివరినాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందుతుందని స్పష్టం చేశారు. ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.
దుమ్ముగూడెం వద్ద ఉన్న రధంగుట్ట వద్ద ప్లాంట్‌ను, తోగ్గూడెంలో ప్లాంట్‌ను ఏర్పాటుచేసి పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గంలోని కొంతభాగానికి మంచినీరు అందిస్తామని అన్నారు. అదేవిధంగా పాలేరులో ఏర్పాటుచేసే ప్లాంట్ ద్వారా ఖమ్మం, ఖమ్మం అర్బన్‌కు నీళ్ళు అందుతాయని, వైరాలో ఏర్పాటుచేసే ప్లాంట్ ద్వారా వైరా, మధిర, పాలేరులోని కొంతభాగానికి నీరు అందుతుందని, భద్రాచలం కూసూరు వద్ద ఏర్పాటుచేసే ప్లాంట్ ద్వారా భద్రాచలం నియోజకవర్గానికి నీళ్ళు అందుతాయని అన్నారు. ఖమ్మంజిల్లాలో రూ 3558కోట్లతో 2655 ఆవాసాలకు మంచినీరు అందించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 30శాతం పనులు పూర్తయినట్లు వివరించారు. విలేఖరుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వాటర్‌గ్రిడ్ సిఇ సురేష్, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, వైస్‌చైర్మన్ బరపటి వాసుదేవరావు పాల్గొన్నారు.