తెలంగాణ

ధాన్యం మొత్తం కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉత్పత్తి చేసే వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డిల నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాలులో ఆదివారం ప్రత్యేక సమావేశం జరిగింది. నిరంజన్‌రెడ్డి, కమలాకర్ ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ఆదేశించారు. రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఉండాలని, గన్నీ బ్యాగులు సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే తేమ పరిశీలించే యంత్రాలు తగినన్ని సమకూర్చుకోవాలన్నారు. వరి, సోయాబీన్, పెసర తదితర పంటలను సాగు చేసిన రైతుల వివరాలు, ఉత్పత్తి అంచనాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా తెప్పించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జాయింట్ కలెక్టర్లతో వచ్చే వారం సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షించాలని ఆదేశించారు. రాష్టస్థ్రాయిలో ఒక మానిటరిగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, వేర్‌హౌజింగ్, మార్క్‌ఫెడ్, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రికి లేఖ
పెసళ్లను కొనుగోలు 50 శాతం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖరాశారు. ఈ సారి రాష్ట్రంలో పెసల దిగుబడి ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం ప్రకటించిన నిర్ణయం ప్రకారం 25 శాతం అంటే 10,378 మెట్రిక్ టన్నులు సేకరించాలని ప్రణాళిక రూపొందించారు. రైతుల నుండి కనీసం 20,885 మెట్రిక్ టన్నులు (50 శాతం) కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని నిరంజన్‌రెడ్డి కోరారు.