తెలంగాణ

బదిలీల భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: ఇల్లలకగానే పండుగ కాదు. జిల్లాల విభజనకు పూనుకోగానే అయిపోయినట్టు కాదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రభుత్వోద్యోగుల బదిలీలు భారీఎత్తున చేయాల్సి వస్తుంది. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. దాదాపు లక్షనుంచి లక్షన్నర మంది ఉద్యోగులను ‘రీడిప్లాయ్’ కింద బదిలీ చేయాల్సి ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఈ అంశంపై నివేదిక పంపించాలని జిల్లాల యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై చర్చించారు. జిల్లాలస్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో అధికారిక కమిటీలను వేసి బదిలీలను చేయాల్సి వస్తుంది.
తెలంగాణలో ప్రభుత్వ నియమావళి, అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే నాలుగు లక్షలమంది ఉద్యోగులు అవసరం ఉంది. ప్రస్తుతం మూడు లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 1.25 లక్షల మంది టీచర్లే. గ్రామ రెవెన్యూ సహాయకులతో (విఆర్‌ఎ) సహా రెవెన్యూ సిబ్బంది 39 వేల మంది వరకూ ఉంటారు. మిగతా వారు వ్యవసాయం, పౌరసరఫరాలు, విద్యుత్, అడవులు, పర్యావరణం, ఆర్థిక, వైద్యం ఆరోగ్యం, హౌసింగ్, పరిశ్రమలు, నీటిపారుదల, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, యువజన సర్వీసులు, సంక్షేమ శాఖలకు చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మూడు రకాల ఉద్యోగులున్నారు. జిల్లాస్థాయి ఉద్యోగులు ఒకరకమైతే, జోనల్‌స్థాయి ఉద్యోగులు మరో విభాగం కాగా, రాష్టస్థ్రాయి ఉద్యోగులు ఇంకో కేటగిరీ. క్లాస్ ఫోర్ నుంచి డిప్యూటీ తహశీల్‌దారు వరకు జిల్లాస్థాయి పరిధిలోకి వస్తారు. తహశీల్దారులు ఈ పోస్టుకు సమానస్థాయి కలిగిన ఇతర శాఖల ఉద్యోగులు జోనల్ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం మూడు జోన్లు ఉన్నాయి. ఆర్‌డిఓ దానికి సమానస్థాయి కలిగిన వారు రాష్టస్థ్రాయి పరిధిలోకి వస్తారు. టీచర్లంతా జిల్లాల పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అయితే మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం జిల్లాస్థాయి ఉద్యోగులే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలున్నాయి. దాదాపు అన్ని జిల్లాలు పునర్వ్యవస్థీకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల బదిలీలు చేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి ఉద్యోగుల్లో సగానికిపైగా ఉద్యోగులు తమ సొంత గ్రామానికి దగ్గర్లోనే పనిచేస్తున్నారు. ఒక రెవెన్యూ డివిజన్‌కు చెందిన వారు ఇతర రెవెన్యూ డివిజన్లలో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అంచనావేశారు. ఈ తరహా ఉద్యోగులను జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సొంత రెవెన్యూ డివిజన్/ సొంత జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. బదిలీ చేయాల్సి వస్తే లక్ష నుండి 1.2 లక్షల మందిని బదిలీ చేయాల్సి వస్తుంది.
మళ్లీ సిఫారసులే..
బదిలీల పర్వం మొదలైతే మళ్లీ సిఫారసులకే ప్రాధాన్యం లభిస్తుంది. సాధారణంగా ఒక శాసనసభా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆయన పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తుంటారు. ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా పనిచేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే సిఫార్సుల లేఖలతో జిల్లా కలెక్టరేట్ మునిగిపోతుంది. ఇప్పటి నుండే ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎన్నుకుని, తమ స్థాయిలో ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆప్షన్లు ఉంటాయి
ఉద్యోగులను బదిలీ చేసే సమయంలో ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని ‘ఆప్షన్’ అడుగుతుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు నరేందర్‌రావు తెలిపారు. ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ దాదాపు సీనియర్లందరినీ సొంత జిల్లాలోనే అకామిడేట్ చేస్తారన్నారు. కొత్తగా ఏర్పడే ఒక జిల్లాలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, పక్కనే ఏర్పడే జిల్లాలో తక్కువ మంది ఉంటే జూనియర్లను పక్క జిల్లాకు పంపిస్తారని వివరించారు. వీలైనంత వరకు ప్రతి ఉద్యోగిని సొంత జిల్లాలోనే నియమించేందుకు ప్రయత్నిస్తారని వివరించారు.